Friday, October 7, 2016

కృతజ్ఞతలు... ఇందులోని కథల్లో కొన్ని 1978-1980 రాసినవి. అవి ఇటీవలే పత్రికలనుండి సేకరించడం జరిగింది. అందుకు ఎందరో సహకరించారు. శ్రీకాకుళంలోని కథా నిలయం నుండి ఓబులేశు కొన్ని కథలు సేకరించి యిచ్చారు. కథలను సేకరించడంలో ఎందరో సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు. ఈ కథల్లో కొన్ని ఆయా కథా సంకలనాలలో చేర్చబడ్డాయి. ఆయా సంకలనాల సంపాదకులకు, తొలుత ప్రచురించిన పత్రికలకు, వాటి సంపాదకులకు, అచ్చైన తర్వాత అనేక సూచనలు చేసిన పాఠకులకు, మిత్రులకు అభినందించిన సాహిత్య అభిమానులకు కృతజ్ఞతలు. జ 1991లో వెలువడిన 'పాలు' కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన సుప్రసిద్ధ కథకులు, చిత్రకారులు చంద్రగారికి... జ 1997లో వెలువడిన 'స్మృతి' కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన సుప్రసిద్ధ చిత్రకారులు ఏలె లక్ష్మణ్‌ గారికి... జ 2000లో వెలువడిన 'మమతలు - మానవ సంబంధాలు' కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన శ్రీ డిజైన్స్‌ కరుణాకర్‌గారికి... జ 2003లో వెలువడిన 'వేపచెట్టు' కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన కాస్మిక్‌ గ్రాఫిక్స్‌ అయిల సైదాచారి గారికి... జ 2004లో వెలువడిన 'తేనెటీగలు' కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన సుప్రసిద్ధ చిత్రకారులు ఏలె లక్ష్మణ్‌ గారికి... జ 2004లో వెలువడిన 'పాలు' - 'సదువు' ఇతర కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన అంకుష్‌ గ్రాఫిక్స్‌వారికి... జ 2005లో వెలువడిన 'బతుకుపయనం' కథల సంపుటి ముఖచిత్రం తీర్చిదిద్దిన సుప్రసిద్ధ చిత్రకారులు ఏలె లక్ష్మణ్‌ గారికి... జ 'కాలం తెచ్చిన మార్పు' కథల సంపుటి బ్యాక్‌ కవర్‌ ఫోటోతోపాటు షష్ఠిపూర్తి సందర్భంగా అనేక ఫోటోలు అందంగా తీసి అందించిన సుధాకర్‌గారికి... అనేక పుస్తకాల ముఖచిత్రాలను తీర్చిదిద్దిన ఏలె లక్ష్మణ్‌గారికి... సుప్రసిద్ధ రచయితలు, చిత్రకారులు శీలా వీర్రాజుగారికి... రమణ జీవి గారికి... భరత్‌ భూషణ్‌ గారికి... జుగాష్‌విలి గారికి... రెండు దశాబ్దాలుగా అనేక విషయాలు కలిసి పంచుకుంటున్న డా. కత్తి పద్మారావుగారికి... సకాలంలో అందంగా ముద్రిస్తూ అందిస్తున్న కర్షక్‌ ప్రింటర్స్‌ వారికి, ఆయా పత్రికల్లో కథలకు చక్కని బొమ్మలు వేసిన బాలి, కరుణాకర్‌ తదితర చిత్రకారులకు కృతజ్ఞతలు. ఆయా కథా సంపుటాలకు ముందుమాటలు రాసిన కీ.శే. మధురాంతకం రాజారాం, జయధీర్‌ తిరుమలరావు, డా. కేతు విశ్వనాథరెడ్డి, సదానంద శారద, డా. బోయ జంగయ్య, డా. కాలువ మల్లయ్య, డా. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, డా. సి. నారాయణరెడ్డి, చలసాని ప్రసాదరావు, జి. గంగాధర్‌, డా. పత్తిపాక మోహన్‌, గూడూరి సీతారాం, కొక్కుల భాస్కర్‌, డా. ఎస్‌.వి. సత్యనారాయణ, డా. అంబటి సురేందర్‌రాజు. డా. జైశెట్టి రమణయ్య, ఎన్‌. వేణుగోపాల్‌, సారథి శ్రీనివాస్‌ గారలకు... ఆయా పుస్తకాలను పత్రికల్లో సమీక్షించిన సమీక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. పై కథా సంపుటాలలోని కథలను ప్రచురించిన పత్రికల సంపాదకులకు... ముఖ్యంగా... ఆయా పత్రికలలో ప్రచురించుటకు సహకరించిన వార్త సంపాదకులు కె. రామచంద్రమూర్తి, టంకశాల అశోక్‌, కల్లూరి భాస్కరం, గుడిపాటి, జి. శ్రీరామమూర్తి ఆంధ్రభూమి సంపాదకులు ఎం.వి.ఆర్‌. శాస్త్రి, సాక్షి ఫన్‌ డే సంపాదకులు పూడూరు రాజిరెడ్డి, 'దట్స్‌ తెలుగు డాట్‌ కాం' ఇంటర్‌నెట్‌ పత్రిక సంపాదకులు కాసుల ప్రతాపరెడ్డి, 'దళిత జ్యోతి' పత్రిక సంపాదకులు వర్ల రామయ్య, ఆంధ్రజ్యోతి వీక్లీ సంపాదకులు కీ.శే. పురాణం సుబ్రహ్మణ్య శర్మ. 'స్వాతి' మాస పత్రిక సంపాదకులు వేమూరి బలరాం, సృజన సాహితీమిత్రులు, వరవరరావు, కె. రామ్మోహన్‌రాజు, ఎన్‌.కె. తదితరులు, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‌, వేమన వసంతలక్ష్మి, 'మాభూమి' పత్రిక సంపాదకులు ఎబికె ప్రసాద్‌, 'జనధర్మ' - 'వరంగల్‌వాణి' సంపాదకులు కీ.శే. ఎం.ఎస్‌. ఆచార్య, 'బతుకునేర్పిన పాఠం' కథ తొలి ప్రతిని 'నూతన మాసపత్రిక'లో ప్రచురించిన సంపాదకులు ఎం. రత్నమాల, 'నవ్య' వీక్లీ సంపాదకులు ఎ.ఎన్‌. జగన్నాథ శర్మ. 'సలాం హైదరాబాద్‌' సంపాదకులు ఆర్‌. సత్యనారాయణ, కేతు విశ్వనాథరెడ్డి గారలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కథల రూపకల్పనల్లో అనేక స్థాయిల్లో చర్చలు చేసి తమ అభిప్రాయాలు తెలిపిన మిత్రులు, కథకులు ఎందరో... కీ.శే. గూడూరు సీతారాం... మా ఆవిడ శ్యామల... భీమనాతి ప్రభాకర్‌... సిహెచ్‌.వి. ప్రభాకర్‌రావు... స్మితారావు, శాతవాహన హైస్కూల్‌, జగిత్యాల... కొక్కుల పద్మావతి... వొడ్నాల సూర్య... నల్లాల లక్ష్మీరాజం... దేవరశెట్టి జనార్ధన్‌... కీ.శే. రామలక్ష్మణ్‌ ... కె. పోచయ్య... కనికరం లచ్చన్న... వనమాల సత్యనారాయణ... పి. చంద్‌ యాదగిరి... కాలువ మల్లయ్య... ఆడెపు లక్ష్మీపతి... నేరెళ్ళ శ్రీనివాస్‌గౌడ్‌... అల్లం రాజయ్య... వరవరరావు... గాజుల నారాయణ... వడ్డేపల్లి వెంకటేశ్వర్లు... వైకుంఠం... రిటైర్డ్‌ డి.ఆర్‌.ఓ. రామచంద్రం... గారలకు కృతజ్ఞతలు. ఇందులోని కొన్ని కథలను ఆయా కథా సంకలనాల్లో చేర్చారు. 'పాలమూర్‌ లేబర్‌ తిరుగుబాటు' కథను 'తిరుగుబాటు' పేరుతో 'భూమిక' కథా సంకలనంలో ఎస్‌. రాములు పేరిట సంకలనంలో చేర్చిన తుమ్మేటి రఘోత్తంరెడ్డి, 'నాగశాల' కథను 'భారతీయ సాహిత్యం - తెలుగు కథలు' సంకలనంలో, 'మలియవ్వనం' కథను 'కరీంనగర్‌ జిల్లా కథలు' 4వ సంపుటిలో చేర్చిన వనమాల చంద్రశేఖర్‌ గారలకు... కృతజ్ఞతలు. ఈ కథల్లో పాత్రదారులైన వ్యక్తులు ఎందరో... ఎన్నో సజీవమైన పాత్రలు... సంఘటనలు, సన్నివేశాలు... ఈ కథల్లోకి నడిచి వచ్చాయి. జీవిత నాటక రంగంలో ఎవరి పాత్ర వారు... పోషిస్తున్న క్రమాన్ని గమనించి... వాటిని సాహిత్యీకరించడం జరిగింది. ఇందులోని కథల మూల పాత్రధారులకు... ఆయా కథలకు ప్రేరణ, స్ఫూర్తి అయిన మిత్రులకు... ప్రజలకు... కృతజ్ఞతలు. - బి.ఎస్‌. రాములు