Tuesday, July 14, 2015
తెలంగాణ రాష్ట్రం వచ్చాక మరింత పెరిగిన పాఠకుల, పత్రికల కర్తవ్యాలు
తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని రంగాల్లో అందరి కర్తవ్యాలు పెరిగాయి. తెలంగాణ పత్రికా రంగం, ీవీ ఛానల్స్ ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏమిో, ప్రాధాన్యతలు ఏమిో, ఎక్కడ గాడి తప్పుతున్నదో గుర్తు చేస్తుాంయి. ప్రజల సమస్యలను అందరి దృష్టికి తెస్తుాంయి. ఆయా రంగాలను వివరంగా, విశ్లేషణాత్మకంగా, తులనాత్మకంగా అధ్యయనం చేసి అనేక వార్తా వ్యాసాలను, సంపాదకీయాలను అందిస్తాయి. నమస్తే తెలంగాణ పత్రిక ఈ విషయంలో చేసిన కృషి ఇంతా అంతా కాదు. తెలంగాణకు 1956 నుండి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, వలసవాదుల అక్రమాలు, ఆధిపత్యాలు, వనరుల దోపిడీ, భాషా పెత్తనం, సంస్కృతి పెత్తనం, ఆర్ధిక పెత్తనం ఎన్ని రూపాల్లో నిర్దిష్టంగా ఎలా సాగిందో ఒక్కొక్క కోణాన్ని, ఒక్కొక్క వ్యాసపరంపరగా ముందుకు తెచ్చింది. పుస్తకాల్లో ఎన్నో ఉంాయి. డాక్యుమెంట్లలో, రాజపత్రాల్లో మరెన్నో ఉంాయి. అవన్నీ ప్రజలకు విశ్లేషణాత్మకంగా తేలిక భాషలో అందే విధంగా అందించడం నమస్తే తెలంగాణ చేస్తున్న కృషి.
ఈ పని ఇంతకుముందు పత్రికలు చేయలేదా... అంటే చేశాయి. కానీ అవి తమ స్వప్రయోజనాల కోసం అనేక అంశాలను ముందుకు తెచ్చాయి. సీమాంధ్ర సామాజిక వర్గాల స్వార్ధ ప్రయోజనాల కోసం అనేక పత్రికలు కొన్ని థాబ్దాలుగా తెలంగాణ ప్రజలను తప్పుడు సమాచారంతో మభ్య పెడుతున్నాయి. తప్పుదారి ప్టిస్తున్నాయి వారి చరిత్రే తెలంగాణ ప్రజల చరిత్రగా, వారి సంస్కృతే తెలంగాణ సంస్కృతిగా ప్రచారం చేశారు. వారి భాషే తెలంగాణ ప్రజలపై బలవంతంగా రుద్దారు. ఉర్దూ అధికార భాషగా ఉన్న నైజాం కాలంలో తెలంగాణ భాషలో కొన్ని ఉర్దూ పదాలు చేరిన మాట వాస్తవం. అయితే సీమాంధ్ర భాషాధిపత్యంతో తెలంగాణ భాషే వెనక్కి న్టెి వారి వాక్య విన్యాసం, అభివ్యక్తి అలవర్చుకోవాలని పరకాయ ప్రవేశం చేయించాలని ప్రయత్నించారు. పత్రికల ద్వారా, సినిమాల ద్వారా, పాఠ్యపుస్తకాల ద్వారా మీ భాష చెత్త భాష అని కించపరచడం ద్వారా వారి భాషా, సంస్కృతులను, ఆధిపత్యాన్ని, భావజాలాన్ని రుద్దారు. వాటన్నినీ వదిలించుకోవడం ఒక్కరోజులో అయ్యే పని కాదు. క్రమక్రమంగా మనం అలవాటైన పరకాయ ప్రవేశ భాష నుండి మన తెలంగాణ భాషలోకి స్వగృహ ప్రవేశం చేయాల్సి ఉంది. ఇందుకు పత్రికలు చక్కని సాధన. నమస్తే తెలంగాణ పత్రికలో తెలంగాణ భాషలో, నుడికారంలో వార్తలు, వ్యాసాలు రాయడం ఎంతైనా అవసరం. అందుకు కొంత శిక్షణ ఇవ్వడం కూడా అవసరమే.
1984లో కరీంనగర్ నుండి జీవగడ్డ అనే స్థానిక దినపత్రిక వెలువడ్డప్పుడు అల్లం నారాయణ, కె.ఎన్.చారి, ఘాం చక్రపాణి, అన్నవరం దేవేందర్ విం ఎందరో జర్నలిస్టులుగా, కాలమిస్టులుగా ఎదుగుతూ వచ్చారు. సుమారు 150 మంది జర్నలిస్టులు జీవగడ్డలో అక్షరాభ్యాసం చేసి పలు పత్రికల్లో ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆ దినపత్రిక తెలంగాణ భాషా పదాలను ప్రత్యేకంగా రూపొందించి జర్నలిస్టులకు అందజేసింది. అలా జీవగడ్డ పత్రికలో సీమాంధ్ర పదాలకు భిన్నంగా తెలంగాణ పదాలతో వార్తా రచనను ప్రోత్సహించింది. అది తన కర్తవ్యంగా భావించింది.
1990 నుండి తెలంగాణ ప్రాంతంలోని ఎడిషన్లలో తెలంగాణ భాషలో వార్తలు, వ్యాసాలు రాయాలని మేము ఉద్యమించాము. పలువురు సంపాదకులతో చర్చించాము. దాని ఔచిత్యాన్ని అంగీకరిస్తూనే నిర్దిష్ట సమస్యలు ఏమిో వివరించారు. తెలంగాణ నుండి విలేకరులు వార్తలు రాసి పంపిస్తే డెస్క్‌లో ఉన్న ఉపసంపాదకులు, పేజీ ఇన్‌ఛార్జిలు వాిని అర్ధం చేసుకోలేక, ఎడింగ్ చేయలేక సతమతమైపోతున్నారని అన్నారు. అందువల్ల జిల్లా ఎడిషన్లలోనైనా తెలంగాణ భాషలో వార్తలు వేయలేకపోతున్నామని చెప్పారు. అలా డెస్క్‌లో తెలంగాణ వాళ్లు కాకుండా సీమాంధ్రుల ఆధిపత్యమే కొనసాగుతున్నదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా తెలంగాణ భాషలో పత్రికలు తీయడం కష్టం కాదు.
ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. తెలంగాణ నుండి ఎంతో మంది డెస్క్‌ల్లో పని చేస్తున్నారు. సంపాదకులుగా కూడా ఎదిగారు. అయినా సీమాంధ్ర భాషా పెత్తనంలోనే పత్రికలు నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ భాషలో, తెలంగాణ పత్రికా భాషలో మార్పు రాకపోతే ఆ మేరకు మనకు స్వరాష్ట్ర, స్వభాష స్వభావం ఇంకా రాలేదనే అర్ధం. అందువల్ల అన్ని రంగాలను తెలంగాణీకరించడంలో భాగంగా పత్రికా భాషను తెలంగాణీకరించడం అవసరం. అందుకు నమస్తే తెలంగాణ పత్రిక మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు పూర్తి స్థాయిలో నమస్తే తెలంగాణ ఈ కృషికి పూనుకోవాలి. తెలంగాణ పండుగలు రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వం ప్రకించగలిగింది. అలా బతుకమ్మ, బోనాలు ప్రభుత్వ అధికార పండుగలుగా గుర్తింపు పొందాయి. అలాగే తెలంగాణ ప్రాంతీయ ప్రత్యేక ఆటలు, పాటలు గురించి క్షేత్ర స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా ోర్నమెంట్లను, పోీలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అవసరం.
తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రెస్ అకాడమీపై తెలంగాణ భాష గురించి గురుతరమైన బాధ్యత ఉంది. చిన్నా, పెద్ద అన్ని పత్రికల స్ట్రింగర్లకు, విలేకరులకు, సబ్ ఎడిటర్లకు తెలంగాణ భాషలో రాయడానికి సంబంధించిన శిక్షణా తరగతులను డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిర్వహించవలసి ఉంది. అందుకు సలహా కమిీతో, నిపుణులతో ఒక పాఠ్య ప్రణాళిక రూపొందించుకోవాలి. తెలంగాణ పత్రికా భాష పదకోశాన్ని వెంటనే తయారు చేసుకోవాలి. ప్రభుత్వం నుండి ఇతోధిక నిధులు రాబ్టి వీటన్నినీ పూర్తి చేయాలి. తెలంగాణ భాష పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణపై గురుతరమైన బాధ్యత ఉంది. కేసీఆర్ సమస్త రంగాల్లో తెలంగాణ కోణంలో ఆలోచించి ఎలా నూతన పరిష్కారాలను, ఆలోచనలను ముందుకు తెస్తున్నారో, అదే విధంగా తమ తమ రంగాల్లో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా తెలంగాణ ప్రెస్ అకాడమీ తెలంగాణ భాష పత్రికా భాషగా రూపొందించే కృషిని తలకు ఎత్తుకోవాలి. ప్రజల్లో, పల్లెల్లో వాడుక భాషగా ఉన్న భాషనే పత్రికా భాషగా సంస్కరించుకోవాలి. సంస్కృత పదాలు వీలైన మేరకు లేకుండా ప్రజల మధ్య నానుతున్న ఏ భాషా పదాలైనా స్వీకరించాలి.
నమస్తే తెలంగాణ పత్రిక లేకపోయి ఉంటే ఆయా రంగాల్లో అవినీతిని, అక్రమాలను, వనరుల దోపిడీని ప్రజలకు వివరించడం, చైతన్యపరచడం, వెలికి తీయడం సాధ్యమయ్యేదా? పత్రిక కోసం ఎవరైనా సమాచారం అడిగినప్పుడు ఇవ్వక తప్పదు. కనుక అలా పత్రికకు ప్రత్యేక సౌకర్యాలు ఉంాయి. గ్రంథ రచయితలకు, వ్యాసకర్తలకు ఈ అవకాశాలు పరిమితం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా సీమాంధ్ర ఆధిపత్యంలోని పత్రికలే ఇంకా అధిక సర్క్యులేషన్లో ఉండడం వారి ఆధిపత్యాన్ని, భావజాలాన్ని, సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడే భావజాలం ఇంకా మన ప్రజల్లో నిరంతరం ఎక్కించబడుతున్నదని అర్ధం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికల కన్నా నమస్తే తెలంగాణ సర్క్యులేషన్ తెలంగాణలో అధికంగా ఉన్నప్పుడే లక్ష్యం చేరుకున్నట్టు లెక్క. మన భాష, మన సంస్కృతి, మన పత్రిక అనే భావన ప్రజల్లో పెరిగిందనడానికి అది సాక్ష్యం. దీన్ని సాధించడంలో ఆయా పత్రికలను అన్ని విషయాల్లో అధిగమించే నాణ్యతను, నైపుణ్యాన్ని, మార్కిెంగ్ను పెంచుకోవడం అవసరం.
అంతేకాదు ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ, పత్రికా రంగంలో గానీ తెలంగాణ దృష్టితో తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరిన్ని పత్రికలు, ఛానళ్లు రావడం ఎంతో అవసరం. ముఖ్యంగా కనీసం మరో రెండు దినపత్రికలు తెలంగాణ భాషలో రావాల్సిన అవసరం ఉంది. కథలు, నవలలు వగైరా ప్రచురించే వార పత్రికలు, మాస పత్రికలు కనీసం ఒక ఐదారైనా వెలువరించడం ఎంతో అవసరం. దినపత్రికకు అనేక హంగులు ఉంాయి కాబ్టి నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యం ఆధ్వర్యంలో సచిత్ర వారపత్రికలు, మాసపత్రికలు, మహిళా పత్రికలు ప్రచురించడం ఎంతో అవసరం. ఈనాడు దినపత్రిక ప్రచురిస్తున్న అన్నదాత స్థానంలో తెలంగాణ వ్యవసాయ అవసరాల కోసం వ్యవసాయ పత్రికను ప్రత్యేకంగా తీసుకురావాలి తెలుగువెలుగు వలె తెలంగాణ పత్రికను విపుల, చతురవలె, నవ్య వారపత్రిక వలె తెలంగాణ ప్రత్యేక పత్రికలను తెలంగాణ కోణంలో తెలంగాణ జీవితాలతో తెలంగాణ రచయితల రచనలతో సమగ్రంగా తీసుకురావడం ఎంతో అవసరం.
ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి విం సీమాంధ్ర పత్రికలు, ఛానళ్లు తెలంగాణలో అత్యధిక సర్క్యులేషన్లో ఉన్నంత కాలం మనం ఆ రంగంలో ఇంకా వెనుకబడినట్టే లెక్క. తెలంగాణ ప్రజలు సీమాంధ్ర భావజాల ఆధిపత్యాన్ని, సీమాంధ్ర దృష్టి కోణాన్ని ఇంకా అంగీకరిస్తున్నారని, ఫాలో అవుతున్నారని అర్ధం చేసుకోవాలి. వార్తల్లో వ్యాఖ్యగా పాలల్లో, నీళ్లల్లో సీమాంధ్ర ఆధిపత్యం, తెలంగాణ వ్యతిరేకత వాిల్లో కొనసాగుతూనే ఉంటుంది. వేపచెట్టు మామిడి పండ్లను ఇస్తుందా? ఒక రెండు నెలలు సీమాంధ్ర పత్రికలను చదవడం మానేస్తే తెలంగాణ పత్రికలను, ఛానళ్లను చదవడం, చూడటం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత సిగరెట్లు మానేసినట్లు సీమాంధ్ర మీడియా వ్యసనం నుండి బయటపడడం సాధ్యమే. కుిం వాళ్ళయినా, గుడ్డి వాళ్ళయినా, కలర్ తక్కువ ఉన్నా, ప్రతిభ తక్కువ ఉన్నా మన పిల్లల్ని మనం ప్రేమించకుండా ఉంామా? నమస్తే తెలంగాణ, ప్రజాతంత్ర, నేినిజం, చురకలు, ి.న్యూస్, వీ6, హెచ్ఎంీవీ, మన పత్రికల్ని, మన ఛానళ్లను మన పిల్లల్ని మనం ప్రోత్సహించినట్టు ప్రోత్సహిస్తూ ఎదిగించుకోవాల్సిన కర్తవ్యం కూడా ప్రజలదే.
అందువల్ల సీమాంధ్ర పత్రికలు, ఛానళ్లు తెలంగాణలో సర్క్యులేషన్లో ఉన్నప్పికీ తెలంగాణ పత్రికలు, ఛానళ్లే తెలంగాణలో అత్యధిక సర్క్యులేషన్లో ఉండడం అవసరం. వారితో పోీ పడి నాణ్యతను, సమగ్రతను, నైపుణ్యాన్ని కూడా పెంచుకోవడం కూడా అవసరం. అప్పుడే తెలంగాణలో ప్రజలను, ప్రజాభిప్రాయాలను, భావాలను, సంస్కృతిని మలిచే కర్తవ్యంలో నాయకత్వం వహించడం జరిగిందని చెప్పవచ్చు. అంతదాకా ఈ కర్తవ్యంలో సీమాంధ్ర పత్రికల భావజాల ఆధిపత్యమే కొనసాగుతున్నదని గమనించడం అవసరం. అందువల్ల తెలంగాణ పారిశ్రామిక వేత్తలు, సాహిత్య కారులు తెలంగాణ భాష, సాహిత్యాల కోసం, తెలంగాణ ప్రయోజనం కోసం పత్రికలు స్థాపించి కృషి చేయాల్సిన అవసరం ఉంది. నమస్తే తెలంగాణ పత్రిక తెలంగాణలో అత్యధిక సర్క్యులేషన్ పత్రికగా ఎదుగుతూ, సీమాంధ్రలోనూ ఎంతోకొంత సర్క్యులేషన్ పెంచుకోగలగాలి. ఎలాగైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, సూర్య, ప్రజాశక్తి మొదలైన పత్రికలు తెలంగాణలో సర్క్యులేషన్ చేసుకుంటున్నాయో అలాగే సీమాంధ్రలో తెలంగాణ పత్రికలు సర్క్యులేషన్ ఎంతోకొంత ఉన్నప్పుడే పరస్పర భావ ప్రచారం, ప్రభావంతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సహృదయత, సమైక్యత సాధ్యపడుతుంది.
Friday, April 10, 2015
ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం కోసం... సాహిత్య సృజన
ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం కోసం...
సాహిత్య సృజన
నిన్ను నువ్వు తెలుసుకో అనేది వేల ఏండ్ల నాటి తాత్విక ప్రశ్న. ఆ ప్రశ్నకు ప్రతితరం, ప్రతి మనిషి సమాధానాలు ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తుంటడు. నీ చరిత్ర నువ్వు రాసుకో అని మనం ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చెప్పినప్పటినుండి చెప్పుకుంట వస్తున్నం. అందుకని నా చరిత్ర నేను రాసుకుంటున్న. సామాజిక చరిత్రతో ముడిపడిన నా చరిత్రకు, అవగాహనకు పరిమితమై ఇది రాస్తున్న.
నా జీవితంలో 'అడవిలో వెన్నెల' కథల సంపుటిలోని కథలు, ఈ కథల కాలం చాలా ప్రాధాన్యత కలిగినది. ఉత్తర తెలంగాణా చరిత్రలో, సామాజిక పరిణామాల్లో కూడా ఈ కాలం చారిత్రక మలుపులకు సంబంధించిన కాలం. ఆ థలో నేను కథలు రాయడంతోపాటు ప్రజల జీవితాలు మెరుగుపడాలని, జీవన ప్రమాణాలు పెరగాలని కృషి చేయడం జరిగింది. అలా ఏ జీవితాలు బాగుపడాలని కోరుకుంటూ పని చేసిన్నో, ఆ జీవితాల గురించి రాసినవే ఈ కథలు. నా 28వ ఏటనుండి 40 ఏళ్ళ వయస్సు మధ్య రాసిన కథలు ఇవి.
1977-1989 మధ్య రాసిన కథలివి
1977-1989 మధ్య చాలా కథలే రాసిన. కొన్ని రాత ప్రతులు పోయినయి. కొన్ని అచ్చయిన కథల పత్రికలు దొరకలేదు. రాత ప్రతులు పోవడానికి, అచ్చయిన పత్రికలు దొరకకపోవడానికి అప్పుడప్పుడు కొందరు ఇల్లు సోదా చేసి తీసుకుపోవడం, ఆ క్రమంలో చాలా రాత ప్రతులు కొందరు కాల్చివేయడం, పడేయడం జరిగిపోయింది. కుదురుగా ఇంటిపట్టున ఉండే అవకాశం ఉన్నవాల్లు వందల కథలు, నవలలు రాసిన్రు. సభలు, సమావేశాలు పేరిట, ఉద్యమంలో నిరంతరం పర్యటనలు, ప్రభుత్వం వెంటాడే నిర్బంధాలు కారణంగా, సామాజిక పరిణామాలను వేగవంతం చేయాలని ప్రజల కోసం పూర్తికాలం పనిచేస్తూ ఒకచోట స్థిరంగా భౌతికంగా గానీ, కుదురుగా గాని లేని ఈ థాబ్ది కాలంలో రాయగలిగినవాటిలో మిగిలినవి ఇంతే. కొన్ని కథలు, నవలలు ప్రచురించేవారు లేక తుదిరూపం సంతరించుకోలేక అలాగే ఉండిపోయాయి. కొన్ని ఇటీవల లభ్యమైనవి. వాటిని ఇపుడున్న ఓపికను బట్టి ఫెయిర్ కాపీ చేసే ప్రయత్నంలో ఉన్నాను. అలా 1977-79 మధ్య రాసిన కొన్ని నవలలు, కథలు ఇంకా వెలువడాల్సినవి లేకపోలేదు.
1977-1984 మధ్య రాసిన 'ఎవరికి వారే', 'పాలమూరు లేబర్ తిరుగుబాటు', 'అసమర్ధుని జీవయాత్ర' మొదలైన కథలు ఇటీవల వెలువరించిన 'కాలం తెచ్చిన మార్పు' కథల సంపుటిలో చేర్చడం జరిగింది. అందువల్ల ఈ సంపుటిలో చేర్చడం లేదు. 'చంద్రం మామయ్య కథలు', 'రాజీ', 'విద్యార్ధుల గురించిన కథలు' మొదలైన కథలు అచ్చువేసిన పత్రికలు దొరికే అవకాశం లేదు. ఇలా కాలం పెట్టిన పరీక్షలో పోయినవి పోగా మిగిలినవి 'అడవిలో వెన్నెల' కథల సంపుటి చేర్చబడినవి.
1977-90 మధ్య రాసిన నా కథలను ఇలా వర్గీకరించవచ్చు
1. తొలి కథలు - ఉద్యమ ప్రారంభ థ కథలు
2. ఉద్యమ కథలు
3. 'కాలం' కథనాలు
4. ఉద్యమ మలిథ కథలు
5. విద్యార్థి యువజనుల కథలు
6. ఉద్యమంలో మహిళల గురించిన కథలు
7. దళాలు - దళాల నిర్మాణం, పని విధానం గురించిన కథలు.
ఇలా సామాజిక ఉద్యమాల థలు మలుపులు సాగినై. నేను రాయడం కూడా వెంటవెంట ఉద్యమాల క్రమంలోనే రాయడం జరిగింది. అలా ఏడు థలను, పరిణామాలను 'అడవిలో వెన్నెల' సంపుటిలో గమనించవచ్చు. 1970 నుండి 1978 దాకా సాగిన ఉద్యమ ప్రారంభ థల కథలను నేను రాయలె. ఉదాహరణకు దొరలను సాంఘిక బహిష్కరణకు గురిచేయడం, దొరల పీడన అణచివేత ఎలా ఉండేదో నేను రాయలె. ఎందుకంటే నేను ఉద్యమ కథలు రాయడం మొదలుపెట్టేటప్పటికి అల్లం రాజయ్య, ముప్పాళ్ళ లక్ష్మణరావు మొదలైన వాల్లు ఆ తొలిథ కథలను రాసిన్రు. వాటిని అనేక సంపుటాల్లో, సంకలనాల్లో చూడవచ్చు.
ఈ కథలపై నందిగామ నిర్మలకుమారి ఎం.ఫిల్.
ఈ కథలు 1974 నుండి 1989 చివరి దాకా ఒక ప్రాంతపు సామాజిక పరిణామాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతయి. ఆ కాలంలో రాసిన ఈ కథలపై నందిగామ నిర్మల కుమారి 2010లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి ఎం.ఫిల్ తీసుకున్నరు. సుప్రసిద్ధ రచయిత అల్లం రాజయ్య కథలకు, నవలలకు వరవరరావు ఒక్కొక్క సంపుటికి ఒక్కొక్క పుస్తకమంత విపులంగా రాసిన పీఠికల్లో ఉద్యమం గురించి చాలా వివరంగా రాసిండు. నా కథల పుస్తకానికి కూడా అట్ల మంచి ముందుమాట రాయిమని వి.వి.ని అడిగిన. ఇప్పటికే చాలా పుస్తకాలు ముందుమాట కోసం అచ్చుకాకుండ పెండింగ్‌లో వున్నయి. నీ పుస్తకానికి రాయాలంటే కనీసం ఏడాది తర్వాత రాస్త అన్నడు. అట్ల సమస్త కోణాలను చెప్పకపోతే, విశ్లేషించకపోతే అర్ధసత్యమే సత్యమై కూర్చుంటది. లెనిన్కూడా సమస్త పార్శ్వాల, కోణాల, సమస్త ఉద్యమాల, సమస్త ఆచరణల యొక్క ఒక ఉజ్జాయింపుగానే సమాజం ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డడు. లెనిన్ ఫిలాసఫికల్ నోట్‌బుక్స్‌లో ఈ విషయంపై విస్తారంగా చర్చించిండు. ఇది బుద్ధుడు చెప్పిన ప్రతీత్య సముత్పాద అనే సూత్రీకరణే. అనేక కారణాలు కలిసి ఒక కార్యం సిద్ధిస్తుంది అని దీని అర్థం. కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో....! అన్నట్టుగా ప్రతిదానికీ అనేక కారణాలు, కోణాలు, ఆచరణలు, ఉద్యమాలు, దర్శనాలు ఉంటయి. ఈ పుస్తకమేమో తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహకారంతో ప్రచురిస్తున్న. జనవరి 2015లో వాల్లకు కాపీలు ఇయ్యాలె అని చెప్పిన. అట్లయితే రాయలేను అన్నడు. దాంతో అల్లం రాజయ్య పుస్తకాలకు రాసిన ముందుమాటల్లో, ఇతర వ్యాసాల్లో వి.వి. చెప్పిన అంశాలు కాకుండా నేను మరికొన్ని అంశాలను, మరికొన్ని కోణాలను వివరించడానికి ఇక్కడ పరిమితం అవుత.
అంతకుముందు వరవరరావు చాలాసార్లు 'బి.ఎస్.! నేను రాయలేనివి, నువ్వు రాయగలిగేవి చాలా ఉన్నై. నేను సాంస్కృతిక సంస్థ నిర్మాణంలో ఉన్న గనుక అనేక విషయాలు చెప్పలేను. నువ్వు బయటపడ్డవు గనుక రాయచ్చు' అన్నడు. గద్దర్ కూడ ఇట్లనే అన్నా నువ్వు పార్టీలో చేసిన చర్చలను, ఇంకెన్నడు రికార్డు చేస్తవు అని చాలాసార్లు అడిగిండు. సుమారు ముప్ఫై ఏండ్ల తర్వాత విప్లవోద్యమం గురించి చెప్పాల్సినవి ఇంతదాక బయట చెప్పలేకపోయినవి ఇపుడు రాస్తున్న. వరవరరావే తాను ముందుమాట రాయక నాకీ అవకాశం ఇచ్చినట్టు లెక్క. నేను ఇవన్ని ఇంతదాక ఎందుకు రాయలేదంటే... సినిమా చూసినవాండ్లు సినిమా చూడనివాల్లతోటి సినిమా గురించి చర్చించినట్టు ఉంటదని రాయలే. ఉద్యమంలో పని చేయనివాల్లతోటి ఎందుకు చర్చించాలె అని రాయలే. ఇపుడు చరిత్ర మలుపు తిరిగింది. మన రాష్ట్రం మనకు ఏర్పడ్డది. చరిత్రను మనకోణంలో రికార్డు చేసే, పునరధ్యయనం చేయడం అవసరం.
Subscribe to:
Posts (Atom)